AP&TG

ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో అత్యధికంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

అమరావతి:.రాష్ట్రంలో శనివారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో అత్యధికంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మార్కాపురం జిల్లా బొట్లగూడూరులో 45.1డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. తిరుపతి జిల్లా వెంకటగిరిలో 45 డిగ్రీలు, నెల్లూరు జిల్లా కలిగిరిలో 44.4 డిగ్రీలు, పల్నాడు జిల్లా నూజెండ్లలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మొత్తం 17 జిల్లాల్లో 239 మండలాల్లో 41 Nడిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదివారం ఎండ తీవ్రతతో పాటుగా 124 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.ఎండ తీవ్రత,ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ద్రోణి ప్రభావంతో అదివారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *