AP&TG

ఎన్.పి.ఏ అయిన టిడ్కోగృహాలకు రూ.102 కోట్లను చెల్లించేందుకు సీఎం ఆమోదం-మంత్రి నారాయణ

అమరావతి: జూన్ 12-2025 నాటికి 1.18 లక్షల టిడ్కోగృహ నిర్మాణాలను పూర్తి చేసి, ప్రారంభిస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్దిశాఖమంత్రి పొంగూరు.నారాయణ చెప్పారు..సోమవారం రాష్ట్ర సచివాలయంలో మీడియా సామవేశంలో మంత్రి మాట్లాడుతూ,ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 44వ సీఆర్డిఏ సమావేశంలో రాజధాని అమరావతి అభివృద్ది పనులకు,టిడ్కోఇళ్ల నిర్మాణాలకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు..గతంలో తమ ప్రభుత్వం పూర్తి చేసిన గృహాలపై గత ప్రభుత్వం బ్యాంకు ఋణాలను తీసుకుని, ఆ సొమ్మును మళ్లీంచడం జరిగిందన్నారు.. ఫలితంగా ఆయా గృహాలు నాన్ పెర్పార్మింగ్ ఎస్సెట్ట్సుగా మిగిలిపోయాయన్నారు..ఈ సమస్య నుంచి బయటపడాలంటే రూ.102 కోట్లు చెల్లించాల్సి ఉందని,, ఆ సొమ్మును ప్రభుత్వం చెల్లించేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారన్నారు.. వీటిలో దాదాపు 1.18 లక్షల గృహా నిర్మాణాలను  వచ్చే ఏడాది జూన్ 12నాటికి పూర్తిచేసి ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.

రూ.2,723 కోట్లతో అమరావతి జోన్-7,10 లే అవుట్ల రోడ్ల నిర్మాణం:- అమరావతి జోన్-7,,10 లే అవుట్ల రోడ్ల నిర్మాణ పనులను రూ.2,723 కోట్లతో చేపట్టేందుకు సీఆర్డీఏ ఆమోదించడం జరిగిందన్నారు..

భూములు అమ్మగా వచ్చే సొమ్ముతోనే రుణాలు తీర్చేస్తాం:- రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్దికి అయ్యే వ్యయ భారాన్ని ప్రజలపై ఒక్క పైసా కూడా వేయడంలేదని మంత్రి స్పష్టం చేశారు..పూలింగ్ ద్వారా రైతుల నుంచి సేకరించిన భూములు అమ్మగా వచ్చే సొమ్ముతోనే అమరావతి అభివృద్దికై తీసుకున్న రుణాలు తీర్చేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.. ఈ విషయంలో ఎటువంటి అపోహలకు తావులేదని, ఎవరు ఎటు వంటి వివర్శలు చేసిన ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *