విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ను త్వరలోనే ప్రారంభిస్తాం-మంత్రి నారాయణ
అమరావతి: విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పై సమగ్ర రవాణా ప్రణాళికను (CMP) సిద్ధం చేసినట్లు మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ తెలిపారు..బుధవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు,, ఈ సందర్భంగా విశాఖ మెట్రో రైల్‌పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి పై విధంగా సమాధానం ఇచ్చారు..ప్రాజెక్ట్ పై సమగ్ర రవాణా ప్రణాళికను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపించినట్లు వెల్లడించారు.. కేంద్రం నుంచి అనుమతి రాగానే ప్రాజెక్ట్ పనులు ప్రారంభిస్తామన్నారు.. గత ప్రభుత్వం విశాఖ, విజయవాడకు మెట్రో రైల్ రాకుండా కక్షపూరితంగా పక్కన పెట్టేసిందని మండిపడ్డారు.. విశాఖలో భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు పొడిగించాలనే సాకుతో డీపీఆర్‌ను నిర్లక్ష్యం చేశారన్నారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెట్రో ప్రాజెక్ట్ పై స్వయంగా కేంద్రమంత్రిని కలిసినట్లు తెలిపారు.. విశాఖపట్నంలో మొత్తం 76.90 కిలో మీటర్ల మేర రెండు ఫేజ్‌లలో నాలుగు కారిడార్లలో మెట్రో నిర్మాణం చేపడతామని అసెంబ్లీలో మంత్రి నారాయణ ప్రకటించారు..