లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ ను విజయవంతంగా పరిక్షీంచిన DRDO
అమరావతి: భారతదేశ రక్షణ వ్యవస్థలో మరో శక్తివంతమైన ఆయుధం చేరింది.డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) మంగళవారం ఒడిశా తీరంలోని చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) నుంచి లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ (LRLACM) తొలి విమాన పరీక్షను మొబైల్ ఆర్టికల్ లాంచర్ నుంచి విజయవంతంగా నిర్వహించింది. పరీక్ష సమయంలో అన్ని సబ్‌సిస్టమ్‌లు శాస్త్రవేత్తలు ఆశించిన విధంగా పని చేశాయి. మిస్సైల్, ప్రాథమిక మిషన్ లక్ష్యాలను చేధించింది. రాడార్, ఎలక్ట్రో-ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్ (EOTS), టెలిమెట్రీ వంటి అనేక శ్రేణి సెన్సార్‌ల ద్వారా క్షిపణి పనితీరును నిశితంగా శాస్త్రవేత్తలు పర్యవేక్షించారు.అలాలగే మిస్సైల్ తనకు నిర్దేశించి లక్ష్యంను చేధించిందా అనే విషయంను నిర్ధారించడానికి ITR ద్వారా వివిధ ప్రదేశాలలో సెన్సార్‌ల మోహరించారు.