సుద్దగడ్డ వాగు సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం చూపుతాం-పవన్ కళ్యాణ్
అమరావతి: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోమవారం మధ్యాహ్నం నుంచి కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్ వరద ప్రాంతాల్లో పర్యటించారు..పిఠాపురం నియోజక వర్గం గొల్లప్రోలులోని జగనన్న కాలనీలో పర్యటించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.. ఏటా ముంపునకు కారణమవుతున్న ఏలేరు ప్రాజెక్ట్ ఆధునికీకరణ పనులను చేపడతామని డిప్యూటీ సీఎం తెలిపారు.. ఏలేరు వరద బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.. వైఎస్సార్సీపీ హయాంలో ముంపు ప్రాంతాల్లో పేదలకు ఇళ్లు కట్టించారని విమర్శించారు.. ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపై కలెక్టర్‌తో మాట్లాడుతూనే ఉన్నానని తెలిపారు,, ముంపు ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.. సుద్దగడ్డ వాగు సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.. గత ప్రభుత్వ తప్పులను మేము సరిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు..జగనన్న కాలనీ స్థలాన్ని రూ.30 లక్షల భూమిని రూ. 60 లక్షలకు కొనుగొలు చేశారని విమర్శించారు..గత ప్రభుత్వ పాలనలో పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యం చేశారు పవన్ మండిపడ్డారు.. కష్టాల్లో ఉన్న పంచాయతీలను ఆదుకోవడం బాధ్యతగా భావించి,,పంచాయితీలకు రూ.లక్ష సాయం అందచేస్తున్నమని తెలిపారు..