నేడు గూడూరులో 44 డిగ్రీలు-గురువారం 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం
అమరావతి: రాష్ట్రంలో రేపు ఒకవైపు ఎండ ప్రభావం చూపే సూచనలు ఉన్నాయని, అలాగే పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎం.డీ పేర్కొన్నారు.
బుధవారం- మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 44.5 డిగ్రీలు, బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం, నెల్లూరు జిల్లా గూడూరులో 44 డిగ్రీలు, కృష్ణా జిల్లా పెదపారుపూడి, పల్నాడు జిల్లా అమరావతిలో 43.4, పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 43.3, ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో 43.2, గుంటూరు జిల్లా రాయపూడిలో 43, ప్రకాశం జిల్లా చీమకుర్తిలో 42.7, తిరుపతి జిల్లా బోనుపల్లెలో 42.4, విజయనగరం జిల్లా రాజాంలో 42.3, ఏలూరు జిల్లా కలపర్రులో 42 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.
గురువారం- ఏలూరు, పోలవరం, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43-45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందని తెలిపారు.శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, మార్కాపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40-42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.

