శ్రీకాళహస్తీశ్వరాలయ స్వామికి ప్రభుత్వం తరపున పట్టువస్త్ర సమర్పించిన- మంత్రి ఆనం
శివ భక్తుల దివ్యక్షేత్రం మన శ్రీకాళహస్తి..
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో వైభవంగా జరుగు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి కలిసి శ్రీకాళహస్తీశ్వరాలయ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ శ్రీకాళహస్తి ఆలయం దేశవ్యాప్తంగా శివ భక్తులకు ఆధ్యాత్మికంగా కీలక కేంద్రంగా ఉన్నదని, ప్రభుత్వం తరఫున మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే, దేవాదాయ శాఖ కమీషనర్ రామచంద్ర మోహన్, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్పీ విష్ణు వర్ధన్ రాజు, రెవిన్యూ డివిజన్ అధికారి భాను ప్రకాష్ రెడ్డి మరియు దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు..