వైసీపీ,ప్రజలు కట్టిన ఇంటి,కుళాయి,డ్రైనేజ్ పన్నుల ఆదాయం కూడా ఉడ్చిపెట్టేసింది-మంత్రి నారాయణ
అమరావతి: వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను పూర్తిగా నాశనం చేసిందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ మండిపడ్డారు.. సోమవారం రాజధాని ప్రాంతాలు మందడం, దొండపాడులో స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సీఆర్డీఏ కమిషనర్, టిడ్కో ఎండీతో కలిసి ఆయన టిడ్కో గృహ సముదాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రానున్న మూడు నెలల్లో టిడ్కో ఇళ్లకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.. జగన్ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందని ఉడ్చిపెట్టేసిందన్నారు.. టీడీపీ ప్రభుత్వంలో 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు.. వీటిలో 4,54,704 ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచామని,, 2019 నాటికి 77,371 ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తి అయిందన్నారు.. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మెుత్తంను వైసీపీ ఖాళీ చేసి వెళ్లిపోయిందన్నారు..ప్రజలు కట్టిన ఇంటి,కుళాయి,డ్రైనేజ్ పన్నుల ఆదాయం కూడా వాడేసిందని తెలిపారు.. టిడ్కో లబ్ధిదారులను బ్యాంకులు ఇబ్బంది పెట్టకుండా గడువు పెంచాలని కోరతామని తెలిపారు.