కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం-మంత్రి పార్ధసారధి
హౌసింగ్ శాఖపై సమీక్ష..
అమరావతి: గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు..ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ గృహ నిర్మాణ శాఖ సమీక్ష సమావేశంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు..రాష్ట్ర సచివాలయంలో సోమవారం హౌసింగ్ శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులు,,అధికారులకు చంద్రబాబు సూచనలు చేశారు..
ఇకపై కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్ధ సారధి మీడియా సమావేశంలో వెల్లడించారు..గత ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపి, లే అవుట్లు వేయకుండా వదిలేసిన స్థలాల్లోనూ పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించామన్నారు.. ఇళ్ల నిర్మాణమనేది ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతా అంశంగా ఉంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారని,,రాబోయే 100 రోజుల్లో 1.25 లక్షల ఇళ్లకు మౌలిక సదుపాయలు కల్పించి నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు..2029 నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంతింటి నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.. కేంద్ర ప్రభుత్వ పథకాలను సమన్వయం చేసుకొని, సరసమైన ధరకు నాణ్యమైన ఇళ్లు అందజేస్తామన్నారు..
ఇళ్లు పూర్తి అయినా పేమెంట్లు చెల్లించ లేదని, ఇలాంటి బాధిత లబ్ధిదారులకు చెల్లింపులు జరపాలని చంద్రబాబు ఆదేశించారన్నారు..మధ్య తరగతి ప్రజలకు MIG లే అవుట్లని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.. జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం చేపట్టి తక్కువ ధరలకు ఇళ్లను నిర్మించి ఇస్తామని తెలిపారు..గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలిచ్చి మౌలిక సదుపాయాలను కల్పించ లేదని, అలాంటి చోట మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.