బిల్ గేట్స్‌తో సమావేశం అయిన సీ.ఎం చంద్రబాబు
అమరావతి: దిల్లీలో ఈ రోజు బిల్ గేట్స్ తో అద్భుతమైన సమావేశం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి,,సంక్షేమం కోసం గో ఆంధ్రప్రదేశ్-గేట్స్ ఫౌండేషన్ ఎలా సహకరించుకోవాలో అనే దానిపై మేము చాలా ఫలవంతమైన చర్చ జరిపామని సోషల్ మీడియా వేదికలో పేర్కొన్నారు.. విద్య, వ్యవసాయం,,ఉపాధి కల్పన ఆరోగ్య సంరక్షణ వంటి కీలక రంగాలలో సేవా బట్వాడా మెరుగుపరచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,,ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల వినియోగాన్ని ఎలా ఉపయోగించాలి అనే విషయంపై చర్చించామన్నారు..స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 దార్శనికతను సాకారం చేసుకోవడానికి గో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా కట్టుబడి ఉందన్నారు..గేట్స్ ఫౌండేషన్‌తో ఈ భాగస్వామ్యం మన ప్రజలను శక్తివంతం చేయడంలో,,ఈ లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని మేము విశ్వసిస్తున్నామని తెలిపారు.. ఆంధ్రప్రదేశ్ పురోగతికి ఆయన సమయం, మద్దతు ఇచ్చినందుకు నేను మిస్టర్ బిల్ గేట్స్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు.