గోవాలో కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు!
వేధింపుల వెనుక నిజం ఎంత ?
హైదరాబాద్ లోని ఫిల్మింనగర్ లో రాత్రి 8 గంటలు నుంచి వేకువజామున 2 గంటల వరకు అదో రంగుల ప్రపంచం..,అక్కడ వున్న గెస్ట్ హౌస్ ల్లో విపరితమైన హడవిడి కన్పిస్తుంది..ప్రోడ్యూసర్లు,డైరెక్టర్లు,,కెమోరామెన్స్, కొరియోగ్రాఫర్స్,,స్టోరీ రైటర్స్,,లిరిక్ రైటర్స్,,మ్యూజిక్ కంపోజింగ్ అంటూ బిజీబిజీగా రూమ్స్ లో కన్పిస్తారు..వీరిని కలిసేందుకు “ప్రత్యేకంగా” చాలా మంది ఔత్సహిక యువతులు,,యువకులు తమకు సినిమాలో ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ కార్లల్లో వచ్చి కలుస్తుంటారు అనేది నిజం…? సదరు గెస్ట్ హౌస్ రూమ్స్ లో ఫిల్మిం మేకర్స్ ను కలిసే వారు మాత్రమే ప్రక్క రోజు ప్రోడ్యూసర్స్,,డైరెక్టర్ల ఆఫీసులో జరిగే స్టోరీ డిస్కషన్స్,ఫోటో షూట్ లో పాల్గొనే అవకాశం వుంటుందనే విషయం కృష్ణానగర్ లో ఏ క్యారెక్టర్ ఆర్టిస్టును అడిగిన చెపుతారు..? కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ పై వచ్చిన ఆరోపణల్లో నిజం ఎంత? పోలీసుల విచారణలో మాత్రమే నిగ్గు తేలుతుంది.?
హైదరాబాద్: మహిళా కొరియోగ్రాఫర్ (21) పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ ను హైదరాబాద్ SOT పోలీసులు, గోవాలో అరెస్ట్ చేసి, హైదారాబాద్ కు తీసుకువస్తున్నట్లు సమాచారం..నాలుగు బృందాలు జానీ మాస్టర్ కోసం గాలింపు చేపట్టగా, ఈరోజు ఉదయం గోవాలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తొంది..
పోక్సో కేసు లో జానీ మాస్టర్‌పై కేసులో నార్సింగి పోలీసుల విచారణ కొనసాగుతోంది..అత్యాచారంతో పాటు బెదిరించడం,,అవుట్‌డోర్ షూటింగుల్లో లైంగికంగా వేధించారని నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో,, పోలీసులు జానీపై 376, 506, 323 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు..
2019లో కాల్ చేసి తన గ్రూపులో చేర్చుకుంటానన్నారని,,అప్పటి నుంచి ఆయన టీమ్‌లో పనిచేస్తున్నట్టు బాధితురాలు తెలిపింది.. చెన్నై, ముంబైలలో ఔట్ డోర్ షూటింగ్స్‌లతో పాటు హైదరాబాద్ నార్సింగిలోని తన ఇంటిలో కూడా జానీ మాస్టర్ లైంగిక దాడి చేశాడని పేర్కొంది.. మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడని,,జానీ మాస్టర్, భార్య తన ఇంటికి వచ్చి తనపై దాడి చేశారని తెలిపింది.. బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన పోలీసులు ఆమెను భరోసా సెంటర్‌కు తరలించారు.
ఈ సంఘటనపై టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానల్ అధ్యక్షురాలు ఝాన్సీ స్పందిస్తూ, మా పరిధిలో మేం విచారణ పూర్తి చేశాం..ఇద్దరి వాదనలు విన్నాం.. 90 రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని రిపోర్ట్ చేస్తాం.. ఇలాంటి వ్యవహారాలపై పరిశ్రమకు చెందిన ఎవరు కైంప్లెంట్ చేసినా, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
ఈ సంఘటనపై టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానల్ అధ్యక్షురాలు ఝాన్సీ స్పందిస్తూ, మా పరిధిలో మేం విచారణ పూర్తి చేశాం..ఇద్దరి వాదనలు విన్నాం.. 90 రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని రిపోర్ట్ చేస్తాం.. ఇలాంటి వ్యవహారాలపై పరిశ్రమకు చెందిన ఎవరు కైంప్లెంట్ చేసినా, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.