డిశంబరు 31 నుంచి సింగిల్ విండో విధానంలో భవననిర్మాణ అనుమతులు-మంత్రి నారాయణ
రాజధానిలో ఐకానిక్ భవనాలు…
అమరావతి: భవనాలు,లేఅవుట్ల అనుమతులు సులభతరం చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. సోమవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ భవన నిర్మాణాలకు సంబంధించిన వివిధ అనుమతులను వేగవంతంగా సులభంగా ఇచ్చే అంశంపై మున్సిపల్ శాఖకు స్పష్టమైన ఆదేశాలు సీ.ఎం జారీ చేశారన్నారు.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా అన్ని అనుమతులు ఒకేచోట సింగిల్ విండో విధానంలో పొందే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు..ఈవిధానం వచ్చే నెల 31 నుంచి అమలులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి నారాయణ వివరించారు..లైసైన్డు సర్వేయర్లు భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన ప్రతిపాదనలను ఆన్లైన్లో అప్లై చేస్తే అందుకు సంబంధించిన అనుమతులను సకాలంలో మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి నారాయణ వెల్లడించారు.ఈఅనుమతులు మంజూరుకు సంబంధించి ఎవరైనా లైసెన్సుడు సర్వేయర్లు అవకతలకు పాల్పడితే అలాంటి వారి లైసెన్సును రద్దు చేయడం తోపాటు వారిపై చట్టపరమైన క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు.దీనిపై ఏర్పాటైన టాస్కుఫోర్సు కూడా ఆన్లైన్లో నిరంతరం పర్యవేక్షణ చేస్తుందని తెలిపారు.
ఐదు ఐకానిక్ టవర్లు,,అసెంబ్లీ, హైకోర్టు డిజైన్లను నార్మన్ పోస్టర్ సంస్థ గతంలో రూపోందించిందని అయితే గత ప్రభుత్వం నార్మన్ పోస్టర్స్ సంస్థ టెండర్ ను,వారి డిజైన్లను రద్దు చేసిందని గుర్తు చేశారు. అందుకే మళ్లీ ఈభవనాల డిజైన్ల కోసం టెండర్లు పిలవగా ఆ టెండర్లు మరలా నార్మన్ పోస్టర్స్ సంస్థకే వచ్చాయని సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో వాటికి ఆమోదాన్ని ఇవ్వడం జరిగిందని అన్నారు..రాజధాని ప్రాంతంలో నిర్మాణాలకు సంబంధించి పనులు త్వరలోనే మొదలు అవుతాయని ప్రపంచ బ్యాంకు రుణానికి ఎలాంటి ఇబ్బంది లేదని దశలవారీగా రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ఇప్పటికే ముందుకు వచ్చిందని మున్సిపల్ శాఖమంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు.