మార్క్ శంకర్, సతీమణి అన్నా లెజినోవాతో కలసి శ్రీవారి మొక్కు తీర్చుకోనున్న పవన్ కళ్యాణ్
అమరావతి: జనసేన అధినత,,ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్,, కుమారుడు మార్క్ శంకర్‌తో సింగపూర్ నుంచి ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు.. ఈ నెల 8వ తేదీన సింగపూర్‌లోని రివర్ వ్యాలీ ప్రాంతంలోని టమాటో కుకింగ్ పాఠశాలలో సమర్ క్యాంప్ లో వున్న మార్క్ శంకర్‌కు అగ్ని ప్రమాదంలో కాలికి, చేతులకు గాయాలు కాగా, అక్కడ ఆసుపత్రిలో వైద్యం అందించి విషయం పాఠకులకు విదితమే.. మార్క్ శంకర్‌కు ఊపరితిత్తుల్లోకి దట్టమైన పొగ చేరడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.. ప్రధాని నరేంద్ర మోదీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో ఫోన్‌లో మాట్లాడి జరిగిన ఘటన గురించి తెలుసుకోవడంతో పాటు సింగపూర్‌లోని భారత హై కమిషనర్‌తో మాట్లాడడంతో,, భారత హై కమిషనర్ కార్యాలయం నేరుగా మార్క్ శంకర్ వైద్య సేవలను పర్యవేక్షించింది.. సింగపూర్ ఆసుపత్రిలో 5 రోజుల పాటు వైద్యు పరివేక్ష్యనలో సేవలు పొందిన తరువాత పవన్ కల్యాణ్, తన కుమారుడు మార్క్ శంకర్, సతీమణి అన్నా లెజినోవాతో పాటు హైదరాబాద్ చేరుకున్నారు.. సోమవారం ఉదయం తిరుమలలో అన్నా లెజినోవాతో కలసి శ్రీవారిని దర్శించుకుని తన కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదం నుంచి బయటపడినందుకు స్వామి వారికి మొక్కులు తీర్చుకోనున్నారు.. మార్క్ శంకర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటున్నాడని పవన్ కల్యాణ్ తెలిపారు..