కోటికి పైగా మొక్కలు నాటిన వనజీవి రామయ్య మృతి
హైదరాబాద్: కోటికి పైగా మొక్కలు నాటిన ఖమ్మం వాసీ వనజీవి రామయ్యకు పదేళ్ల క్రితమే పద్మశ్రీ పురస్కారం లభించింది. ఐదు దశాబ్దాలుగా మొక్కలు నాటుతూ ప్రకృతి ప్రేమికుడిగా పేరు గడించారు. గత అర్ధరాత్రి పద్మశ్రీ వనజీవి రామయ్యకు గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు అయితే ఈరోజు తెల్లవారుజామున మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.