ఎవరో ఏదో మాట్లాడినంత మాత్రాన స్పందించాల్సిన అవసరం లేదు-టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
బి.ఆర్ నాయుడు నష్ట నివారణ చర్యలు..నా ఉద్దేశం అది కాదు..
తిరుమల: తొక్కిసలాట ఘటనపై క్షమాపణ చెప్పడంలో తప్పులేదని కానీ క్షమాపణ చెప్పినంత మాత్రాన బతికిరారు కదా అని అన్నారు.. ఎవరో ఏదో మాట్లాడినంత మాత్రాన స్పందించాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.. తప్పిదం జరిగింది,, అది ఎలా జరిగిందో విచారణ చేయిస్తామని అన్నారు.. శ్రీవారి భక్తులకు వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించడంలో భాగంగా టీటీడీ తిరుపతిలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో జనవరి 8వ తేది రాత్రి బైరాగి పట్టెడలోనూ, విష్ణువాసం కౌంటర్లలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన ఆరుగురు భక్తులు మృతికి టీటీడీ బోర్డు సంతాపం తెలిపింది..తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం సాయంత్రం అత్యవసర సమావేశాన్ని టిటిడి బోర్డు నిర్వహించింది..ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని మీడియా సమావేశంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు.
బి.ఆర్ నాయుడు నష్ట నివారణ చర్యలు(ప్రకటన జారీ):- ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఉద్దేశించి నేను వ్యాఖ్యలు చేసినట్లు అపాదించడం భావ్యం కాదని టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు అన్నారు.శుక్రవారం చైర్మన్ బి.ఆర్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన అత్యవసర టీటీడీ పాలక మండలి సమావేశంలో అయన మాట్లాడుతూ సోషియల్ మీడియాలో ప్రతిఒక్కరి కామెంట్స్ కి స్పందించాల్సిన అవసరంలేదనే ఉద్దేశంతోనే తాను ఆ విధమైన వ్యాఖ్యలు చేసినట్లు చైర్మన్ క్లారిటీ ఇచ్చారు..మొన్న ఘటన జరిగిన వెంటనే మీడియా ముఖంగా భక్తులకు, మృతుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాను అని గుర్తు చేశారు..అలాగే ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులు కమిటీ కంటే ముందు, టీటీడీ పాలకమండలి క్షమాణలు చెప్పడం జరిగిందని ఆయన చెప్పుకుని వచ్చారు..నా వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించినవి కాదని స్పష్టం చేశారు..అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలియచేస్తూ,, క్షమాపణలు గురించి అనవసరమైన అసత్య ప్రచారాలు మానుకోవాలని ఆయన అన్నారు.