అంగరంగ వైభవంగా బాల రాముడి ఆలయ తొలి వార్షికోత్సవం ఉత్సవాలు
జనవరి 11 నుంచి 13 వరకు..
అమరావతి: ప్రపంచ వ్యాప్తంగా వున్న కోట్లాదా మంది హిందువుల ఆరాధ్య దైవం అయిన బాల రాముడి ప్రాణ ప్రతిష్ట గత సంవత్సరం జనవరి 22వ తేదిన అంగరంగ వైభవంగా జరిగింది..సదరు తేదిన నుంచి నేటికి తొలి వార్షికోత్సవం పూర్తి చేసుకున్న సందర్భంగా మూడు రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహించేందుకు యోగి అధిత్యనాధ్ ప్రభుత్వం నిర్ణయించింది.. ఈ కార్యక్రమం నిర్వహణ బాధ్యతను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కు అప్పగించింది.. తీర్థ క్షేత్ర ట్రస్ట్, ఈ వార్షికోత్సవాలను కూడా బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించిన స్థాయిలో నిర్వహిస్తోంది..
ఈ కార్యక్రమాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా ప్రారంభించి,,రాంలాలకు మహాభిషేకం నిర్వహిస్తున్నారు.. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఋషులు,, సాధువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.. జనవరి 11 నుంచి 13 వరకు జరిగే ఈ మహా క్రతువు కోసం ఆలయ ట్రస్టు, జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది..ఇందులో భాగంగా సంగీత,, కళా ప్రపంచంలోని ప్రముఖులు కూడా పాల్గొంటారు..గత సంవత్సరం జనవరి 22న రామ లల్లా మూర్తి ప్రాణ ప్రతిష్ట జరిగింది..ప్రాణ ప్రతిష్ట వార్షికోత్సవాన్ని మాత్రం జనవరి 11న రామమందిరంలో జరిపిస్తున్నారు..వేద పండితులు,, జ్యోతిష్యులు తెలిపిన వివారలు ప్రకారం, గతేడాది పుష్య (పౌష) శుక్ల ద్వాదశి నాడు అయోధ్యలో శ్రీ రామలల్లా విగ్రహ ప్రతిష్ఠ జరిగింది.. ఆ శుభదినాన్ని ‘ప్రతిష్ఠ ద్వాదశి’గా జరుపుకోవాలని రామజన్మభూమి ట్రస్టు పిలుపునిచ్చింది..ఈ సంవత్సరం జనవరి 11వ తేదిన పుష్య శుక్ల ద్వాదశి కాబట్టి ఈ రోజు ప్రాణప్రతిష్ట వార్షికోత్సవాలు వేడుకగా నిర్వహిస్తున్నారు.