నెలకి ఒక్కసారి అయిన స్పెషల్ డ్రైవ్ లో కూర్చుంటాను-మంత్రి నారాయణ
అన్ని మున్సిపాలిటీల్లో త్వరలోనే పురసేవ పునఃప్రారంభం..
నెల్లూరు: రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ప్రజలు తమ భవన నిర్మాణాలకు అనుమతులను వేగంగా, సులభతరంగా పొందేలా చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు..గురువారం నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో పెండింగ్ భవన నిర్మాణాల దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ, భవన నిర్మాణాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై అర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీని క్షుణంగా పరిశీలించి,త్వరతగతిన పరిష్కరించాలని మంత్రి అధికారుల్ని ఆదేశించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో టౌన్ ప్లానింగ్‌లో అనేక ఆరోపణలు వచ్చాయని,ఎంతో మంది తనకు ఫిర్యాదులు చేశారని, అందుకోసమే టౌన్ ప్లానింగ్ స్పెషల్ డ్రైవ్‌ని చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా టౌన్ ప్లానింగ్ లో భవన నిర్మాణాల అనుమతులను సులభతరం చేసేలా చర్యలు మొదలుపెట్టామని చెప్పారు.