త్వరలో పెళ్లి కూతురు కాబోతున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వీ సింధు
అమరావతి: భారత బ్యాడ్మింటన్ స్టార్,, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది.. హైదరాబాద్‌కు చెందిన 29 ఏళ్ల వెంకట దత్తసాయి,,సింధుల వివాహం ఈనెల 22వ తేది ఉదయ్‌పూర్‌లో జరుగనున్నట్లు సింధు తండ్రి పీవీ రమణ వెల్లడించారు.. వెంకట దత్త సాయి,, పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు..మా రెండు కుటుంబాలకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది..కానీ నెల క్రితమే వీరి పెళ్లి ఖాయమైంది.. జనవరి నుంచి సింధు వరుస టోర్నీలు ఆడబోతోంది..అందుకే సాధ్యమైనంత తొందరగా పెళ్లి చేయాలని భావించాం…డిసెంబర్ 22న పెళ్లి వేడుక జరిపించేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకుని ముహూర్తం పెట్టించామని,,24న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఉంటుందని పి.వీ రమణ తెలిపారు..వచ్చే సీజన్ చాలా ముఖ్యమైనది కాబట్టి సింధు త్వరలోనే ప్రాక్టీస్ కూడా మొదలుపెడుతుందన్నారు..