రూ.11,467 కోట్ల మేర టెండర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఆర్డీఏ అథారిటీ-మంత్రి నారాయణ
మూడేళ్లలో అమరావతిని పూర్తి…
అమరావతి: రాజధాని అమరావతిలో కీలక పనులు చేపట్టేందుకు సీఆర్డీఏ అధారిటీ సమావేశం ఆమోదం తెలిపింది..మొత్తం 11,467 కోట్ల మేర పనులకు అథారిటీ ఆమోదం తెలిపినట్లు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు..ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ 41వ అథారిటీ సమావేశం జరిగింది..ఈ సమావేశానికి మంత్రి నారాయణ,సీఎస్ నీరబ్ కుమార్ తో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు…మొత్తం 23 అంశాలకు అధారిటీ ఆమోదం తెలిపింది..అధారిటీ తీసుకున్న నిర్ణయాలను మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు..
సీడ్ కేపిటల్ లో నిర్మించే 360 కిమీల ట్రంక్ రోడ్లలో 2498 కోట్లతో కొన్ని రోడ్లకు పనులు ప్రారంభానికి ఆమోదం తెలిపింది..వరద నివారణ కు 1585 కోట్లతో పాల వాగు,కొండవీటి వాగు,గ్రావిటీ కెనాల్ తో పాటు రిజర్వాయర్లు నిర్మాణానికి నిర్ణయించాం. గెజిటెడ్,నాన్ గెజిటెడ్,క్లాస్ -4,అల్ ఇండియా సర్వీస్ అధికారుల భవనాలు పనులను 3523 కోట్లతో చేపట్టేందుకు అధారిటీ ఆమోదం తెలిపింది..
రైతులకు ఇచ్చిన రిటర్ణబుల్ లే అవుట్ లలో రోడ్లు,మౌళిక వసతుల కల్పనకు 3859 కోట్లకు అనుమతి ఇచ్చినట్లు మంత్రి తెలిపారు..వీటితో పాటు హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ కు అధారిటీ ఆమోదం తెలిపిందన్నారు మంత్రి నారాయణ.ఆయా పనులకు వెంటనే టెండర్లు పిలిచి జనవరి నుంచి పనులు ప్రారంభిస్తామన్నారు.
అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని 5 ఐకానిక్ టవర్లు,అసెంబ్లీ,హై కోర్టు భవనాలు డిజైన్లకు ఇప్పటికే టెండర్లు పిలిచామని,,ఈనెల 15 నాటికి డిజైన్ల టెండర్లు పూర్తవుతాయన్నారు..డిసెంబర్ నెలాఖరుకు ఆయా భవనాల నిర్మాణాలకు కూడా టెండర్లు పిలుస్తామన్నారు.. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం రాబోయే మూడేళ్లలో అమరావతిని పూర్తి చేస్తామన్నారు..