మయన్మార్,థాయ్‌లాండ్‌లో భూకంపం కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం
మరణాల సంఖ్య 10వేలు దాటవచ్చు?
అమరావతి: మయన్మార్ థాయ్‌లాండ్ దేశాల్లో శుక్రవారం తీవ్ర భూకంపాలు కుదిపేసిన విషయం విదితమే..నిమిషాల వ్యవధిలోనే చోటు చేసుకున్న భూ ప్రకంపనలతో మయన్మార్, థాయ్ ల్యాండ్ దేశాల్లో రోడ్లు, భవనాలు, వంతెనలు, ఎయిర్‌పోర్ట్ లు దెబ్బతిన్నాయి..ఈ విపత్తులో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది..మయన్మార్ దేశం ఈ విపత్తు కారణంగా తీవ్రంగా నష్టపోయింది..మృతుల సంఖ్య పెరుగుతునే ఉంది..ప్రస్తుత సమాచారం ప్రకారం మయన్మార్‌లో కనీసం 1002 మంది మరణించినట్లు మయన్మార్ మిలిటరీ అధికారులు శనివారం ఉదయం ఓ ప్రకటనలో వెల్లడించారు.. మరో, 2376 మంది గాయపడినట్లు పేర్కొన్నారు..శిథిలాల కింద వందల మంది చిక్కుకున్నట్లు తెలిపారు.. ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు..బ్యాంకాక్‌లో 10 మంది మరణించగా, ఓ భారీ భవంతి కూలిన ఘటనలో దాదాపు 100 మంది నిర్మాణ కార్మికులు గల్లంతయ్యారు..రెండు దేశాల్లో మరణాల సంఖ్య 10 వేలు దాటే అవకాశం ఉన్నదని అమెరికా ఏజెన్సీ అంచనావేసింది.