అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది-ఒడిశా వద్ద తీరం దాటే అవకాశం-కూర్మనాథ్
అమరావతి: వాయువ్యను ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా,ఉత్తరాంధ్ర తీరప్రాంతంలోని అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని APSDMA ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.ఇది శనివారం తెల్లవారుజామున వాయువ్య దిశగా పయనించి పూరీ సమీపంలో ఒడిశా వద్ద తీరం దాటే అవకాశం ఉందన్నారు..తరువాత క్రమంగా బలహీనపడనుందన్నారు..ఇప్పటికే అత్యవసర సహాయక చర్యల కోసం ఏలూరు జిల్లాకు 2 SDRF, కోనసీమకు 1 SDRF,తూర్పుగోదావరికి 2 SDRF బృందాలు పంపించినట్లు తెలిపారు.. రాష్ట్రంలోని భారీ వర్షాల నేపధ్యంలో లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రవహిస్తున్న వాగులు,కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు.. వాయుగుండం ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.అలాగే కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.