వీఐపీ ప్రొటోకాల్ అనుసరించే “ఎల్లో బుక్” ప్రకారమే జగన్‌కు భద్రత కల్పించం-ప్రభుత్వం
అమరావతి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తాను అధికారంలో వున్నప్పుడు రాష్ట్రంలో ఏదైన ప్రాంతానికి పర్యటను వెళ్లితే,, సంబంధిత ప్రాంతంలో దుకాణలు ముసివేయడం,,పచ్చని చెట్ల కొమ్మలను నరికి వేయించడం,, రోడ్డుకు అటు ఇటు పరదాలు కట్టించే వెసులు బాటు ప్రస్తుతం ఎన్డీఏ పాలనలో లేకపోవడం,,సదరు మాజీ ముఖ్యమంత్రి జీర్ణంచుకోలేక పోతున్నడనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకులను నుంచి వ్యక్తం అవుతున్నాయి..ఇది నిజమా అంటే ?…ఇక ఆసలు విషయంలోకి వస్తే………..
వైసీపీ అధ్యక్షడు,,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భద్రతపై, ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్న విషయం పాఠకులు తెలిసిన సంగతే..వినుకొండ పర్యటన నేపథ్యంలో అర్ధరాత్రి నుంచే జగన్ భద్రత తగ్గించారని,, క్యాంపు ఆఫీస్ వద్ద భద్రతా సిబ్బందిని సైతం ప్రభుత్వం తొలగించిందని ఆరోపణలు చేశారు..
ఆలాగే వైఎస్ జగన్‌కు పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చారని,, రిపేర్‌లో ఉన్న వాహనం ఇవ్వడంతో ప్రయాణానికి ఇబ్బందులు తలెత్తాయని,, వినుకొండ వెళ్తుండగా పలుమార్లు అయన వాహనం మొరాయించిందని సోషల్ మీడియాలో సైతం వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హంగామా చేశారు..ఈ ఆరోపణలు, విమర్శలన్నింటిపైనా రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.. మాజీ సీఎం వైఎస్ జగన్ కి కండిషన్‌లో లేని వాహనాలు ఇచ్చారనే ప్రచారాన్ని అలాగే భద్రత తగ్గించారనే ప్రచారాన్ని కూడా ప్రభుత్వం ఖండించింది..జగన్‌కు ప్రస్తుతం Z+ సెక్యూరిటీకి ఇచ్చే భద్రత ఉందని పోలీసు శాఖ నిర్థారించినది..వాహనం ఫిట్‌నెస్‌పై వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవాల్లేవని కొట్టిపారేసింది..జగన్‌కు కేటాయించి వాహనం పూర్తి ఫిట్‌నెస్‌తో ఉందని కండిషన్ చూసిన తరువాతనే వీఐపీకి కేటాయించామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.. వైఎస్ జగన్‌కు అయనకు అవసరమైన సౌకర్యాలు లేవు అనే కారణంతోనే కారు దిగారని,, అయతే జగన్ కారు దిగిన తరువాత అదే కాన్వాయ్‌లో ఆదే వాహనం సాఫిగా వెళ్లిందని,,ఎటువంటి ఇబ్బంది లేదని అధికారులు స్పష్టం చేశారు.. ర్యాలీలకు, సభలకు అనుమతి లేదని,, జగన్ వెళ్లే పరామర్శ కార్యక్రమానికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నామని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు..వినుకొండ వెళ్తున్న జగన్ కాన్వాయ్‌లోని ఎమ్మెల్సీ,,మాజీ ఎమ్మెల్యేల వాహనాలను ఎక్కడికక్కడ అడ్డుకుని పోలీసులు ఆపేసినట్లు వైసీపీ నేతలు విమర్శలు చేశారు..అయితే రాష్ట్రంలో వీఐపీ ప్రొటోకాల్ అనుసరించే “ఎల్లో బుక్” ప్రకారమే ప్రస్తుతం జగన్‌కు భద్రత ఇచ్చామని ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ప్రకటన రూపంలో స్పష్టం చేసింది.