పుష్ప-2’ సినిమా షూటింగ్ ఆలస్యంపై,బన్నీ వాసు
పాలకొల్లు ఎమ్మెల్యే టికెట్..
హైదరాబాద్: పుష్ప-2’ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో దర్శకుడు సుకుమార్ పనితీరుపై అల్లు అర్జున్ అసంతృప్తితో ఉన్నారని, సినిమా షూటింగ్ కూడా ఆగిపోయిందని, ‘పుష్ప’ పాత్ర కోసం పెంచిన గడ్డాన్ని బన్నీ ట్రిమ్ చేసుకున్నది కూడా ఇందుకేనని పలు కథనాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన నేపథ్యంలో ఈ వార్తలు నిజం కావని,,ఈ వార్తల్లో నిజం లేదని ఇవి నమ్మకండి అని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీమూవీమేకర్స్ ప్రకటించింది..
ఈ విషయమై నిర్మాత బన్నీ వాసు మీడియా సమావేశంలో మాట్లాడుతూ పుష్ప గురించి మీడియాలో వస్తున్న వార్తలు చూసి మేము నవ్వుకుంటున్నాం.. సినిమాలో అల్లు అర్జున్ పార్టు15 నుంచి 20 రోజుల లోపు ఉంది.. ఇది అయిపోతే షూటింగ్ అయినట్లే…సుకుమార్ ఎడిటింగ్ చూసుకొని ఇంకా ఏమన్నా ఛేంజ్ చేయాలా లేదా అనేది క్లారిటీ తెచ్చుకుని షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు.. అల్లు అర్జున్ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని తన గడ్డాన్ని ట్రిమ్ చేశారు.. అల్లు అర్జున్-సుకుమార్‌లా మథ్య అవగాహన అంతలా ఉంటుంది.. ఆగష్టు మొదటి వారంలో ఈ సినిమా షూటింగ్ మళ్లీ స్టార్ట్ అవుతుంది..ఈ ఫేక్ వార్తలను నమ్మకండి..ఈ వార్తల వలన మాకు ఫ్రీ పబ్లిసిటి వచ్చింది అంటూ బన్నీ వాసు వ్యాఖ్యనించారు..
పాలకొల్లు ఎమ్మెల్యే టికెట్:- పాలకొల్లు ఎమ్మెల్యే టికెట్ గురించి పవన్ కల్యాణ్‌ను అడిగారా? అనే ప్రశ్నకు బన్నీ వాసు జవాబిచ్చారు. ‘‘2019 లోనేపాలకొల్లు నుంచి నన్ను పోటీ చేయమన్నారు..అప్పుడే వద్దు సర్..కొంత టైమ్ కావాలి అని అడిగా..నువ్వు అలా ఆలోచించొద్దు..ఓడిపోయినా ఫర్వాలేదు..భయపడకు..ఏదేమైనా ముందడుగేయ్ అని ధైర్యం చెప్పారు..అయితే నేను ధైర్యం చేయలేకపోయాను..2024 ఎన్నికలకు ముందు కలిసినప్పుడు ఇంకా టైమ్ తీసుకుంటావా ? అని అడిగారు.. అల్లు అరవింద్ సర్‌తో మాట్లాడి చెబుతా అని సమాధానమివ్వగా, ఆయనకు నా అభిప్రాయం అర్థమైంది..ఎప్పుడైతే నీకు నువ్వే నిర్ణయం తీసుకుంటావో అప్పుడు నన్ను సంప్రదించు అన్నారు అని బన్నీ వాసు చెప్పారు.