రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలకు అవకాశం-ఐఎండీ
అమరావతి: రాబోయే 24 గంటల్లో మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, వాయువ్య రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కోస్టల్ కర్ణాటక, కేరళలో ఉరుములతో కూడిన మోస్తరు నుండి తీవ్రమైన గాలి,,భారీ వర్షాలు పడే అవకాశం వుందని భారతవాతావరణ శాఖ తెలిపింది..అలాగే ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, ఉత్తర మధ్యప్రదేశ్‌లోని కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ (Nowcast) జారీ చేశారు..మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, దక్షిణ ఒడిశా,ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.