పహల్గామ్ ఉగ్రదాడిలో పర్యాటకులను కాపాడుతూ మరణించిన ఆదిల్ హుస్సేన్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం
అమరావతి: ఏప్రిల్ 22న పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులతో పోరాడుతూ మరణించిన స్థానిక పోనీ రైడ్ ఆపరేటర్ ఆదిల్ షా భార్యకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం శనివారం ఉద్యోగం కల్పించింది..అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్‌లోని హపత్నార్ ప్రాంతంలోని వారి ఇంటికి వెళ్లిన జె-కె లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదిల్ షా భార్య గుల్నాజ్ అక్తర్‌కు అప్పాయింట్ మెంట్ లెటర్ అందజేశారు..ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు భారత ప్రభుత్వంకు కృతజ్ఞతలు తెలిపారు..కాశ్మీర్ లోని ఒక పేద కుటుంబంలో జన్మించి, ఇంటర్ చదివిన ఆదిల్,, అమర్‌నాథ్ యాత్ర సమయంలో పహల్గాంకు వచ్చే పర్యాటకుల కోసం పోనీ గైడ్‌గా పనిచేసేవాడు.. యాత్రికుల్ని గుర్రంపై తీసుకెళ్లి వాళ్లకి అక్కడి ప్రదేశాలు చూపిస్తూ, వాటి గురించి వివరించేవాడు.. ప్రతీ రోజులానే ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో ఉగ్రమూక పర్యాటకులపై కాల్పులు జరుపుతోంది.. దీంతో ఆదిల్ ఎంతో ధైర్య సాహసాలతో ఉగ్రవాదుల నుండి తుపాకీని లాక్కొని పర్యాటకుల్ని రక్షించడానికి తన వంతు ప్రయత్నం చేశాడు..దీంతో ఉగ్రవాదులు ఆదిల్‌ని గన్‌తో కాల్చి చంపారు.