పునరావాస కేంద్రాల్లో 900 మంది,నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్న జిల్లా కలెక్టర్ ఆనంద్
భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా అధికారులు..
నెల్లూరు: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి జిల్లా అధికార యంత్రాంగం పటిష్ఠమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకుంది. జిల్లాకు భారీ వర్షాలు,తుఫాను ముప్పు ఉంటుందని రాష్ట్ర విపత్తుల నిర్వాహణ సంస్థ,వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం తో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ , SP కృష్ణ కాంత్ ముందుగానే జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. పునరావాస కేంద్రాల్లో త్రాగునీరు,ఉదయం అల్పాహారం,రెండు పూటలా భోజనం తదితర సౌకర్యాలు కల్పించారు. జిల్లాలో ఇప్పటి వరకు 14 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి సుమారు 312 కుటుంబాల్లోని 870 మందిని తరలించారు.ఇళ్లలో నీరు తగ్గే వరకు పునరావాస కేంద్రాలలోనే ఉంచాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు.