వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల.భార్గవ్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
అమరావతి: వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవ్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది..ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును భార్గవ్ ఆశ్రయించాడు..శుక్రవారం విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం,,భార్గవ్ కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది..నిబంధనల ప్రకారం ఎస్సీ,, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ ప్రత్యేక కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జస్టిస్ పంకజ్ మిత్తల్,, ఎస్వీ ఎన్.బట్టి ధర్మాసనం సూచించింది..సామాజిక మాధ్యమాల దుర్వినియోగం భరించరాని స్థాయికి వెళ్లింది అన్న సుప్రీం ధర్మాసనం,,ఇలాంటి కేసుల్లో బెయిల్ సులభంగా వస్తే ప్రతిఒక్కరూ హద్దులు లేకుండా వ్యవహరిస్తారని సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది..తప్పు ఎవరు చేసినా తప్పే…ఇక్కడ రాజకీయాలు అప్రస్తుతం అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యనించింది..ఎవరు తప్పు చేసినా వ్యవస్థ చర్యలు తీసుకోవటం తధ్యమని ధర్మాసనం స్పష్టం చేసింది.