నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్,నలుగురు మావోయిస్టులు మృతి
అమరావతి: దండకారణ్యంలో వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టు ఏరివేత కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతొంది..దింతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగులుతోంది.. గురువారం ఉదయం ఛత్తీస్‌గడ్‌లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మరణించగా,, పలువురు గాయపడినట్లు సమాచారం..సంఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు,, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..ఉదయం నుంచి మాధ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి..మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. భద్రతా బలగాల కుంబింగ్ ఆపరేషన్‌లో జరుగుతున్న సమయంలో ఈ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్లు తెలియ వచ్చింది.