మంత్రులు వారి పని తీరును మెరుగు పర్చుకోవాలి-చంద్రబాబు
మంత్రుల పనితీరుపై ర్యాంకులు:-
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది..ఈ సమావేశంలో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ఇకపై 34 శాతం రిజర్వేషన్‌కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది..మొత్తం 21 అంశాలు ఏజెండాగా కేబినెట్ సమావేశం జరిగింది..అలాగే మద్యం వ్యాపారుకు ఇస్తున్న కమీషన్ 10.5 శాతం నుంచి 14 శాతంకు పెంచారు..ఆప్కోస్ ద్వారా కాకుండా ఔట్ సోర్సింగ్ సిబ్బందిని శాఖల వారీగా ఎవరికి వారు ఏజెన్సీల ద్వారా రిక్రూట్ చేసుకోమని,,వైసీపీ అధికారంలోకి రాకముందు ఉన్న విధానాన్నే అనుసరించాలని మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.. ప్రభుత్వం పాలన చేపట్టి ఆరు నెలలు పూర్తి అయింది..మంత్రులు వారి పని తీరును మెరుగు పర్చుకోవాలని ఇక ఊరుకునేది లేదని మంత్రులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు..కేబినెట్ భేటీ అనంతరం మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు..ఈ సందర్భంగా ఫైల్స్ క్లియరెన్స్ లో మంత్రుల పనితీరును సీఎం చంద్రబాబు వివరించారు.. తక్కువ ఫైల్స్ ఉండే వాళ్లు కూడా క్లియరెన్స్‌లో వెనుకబడి ఉంటే ఎలా? అంటూ వెనుకబడిన మంత్రులను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రశ్నించినట్లు తెలిసింది.
మంత్రుల పనితీరుపై ర్యాంకులు:- కందుల దుర్గేష్ (2), కొండపల్లి శ్రీనివాస్ (3), నాదెండ్ల మనోహర్ (4), డోలా బాల వీరాంజనేయులు (5), సీఎం చంద్రబాబు (6), సత్యకుమార్ (7), లోకేష్ (8), బీసీ జనార్థన్ రెడ్డి (9), పవన్ కల్యాణ్ (10), సవిత (11), కొల్లు రవీంద్ర (12), గొట్టిపాటి రవికుమార్ (13), నారాయణ (14), టీజీ భరత్ (15), ఆనం రాంనారాయణరెడ్డి (16), అచ్చెన్నాయుడు (17), రాంప్రసాద్ రెడ్డి (18), గుమ్మడి సంధ్యారాణి (19), వంగలపూడి అనిత (20), అనగాని సత్యప్రసాద్ (21), నిమ్మల రామానాయుడు (22), కొలుసు పార్థసారధి (23), పయ్యావుల కేశవ్ (24), చివరి 25వ స్థానంలో వాసంశెట్టి సుభాష్ ఉన్నట్లు సీఎం చంద్రబాబు వివరించారు.