క్రీడా ప్రోత్సాహకాలు విడుదలపై హర్షం వ్యక్తం చేసిన శాప్ ఛైర్మన్
అమరావతి: వైసీపీ పాలనలో రూ.11,68,62,288 క్రీడా ప్రోత్సాహకాలు పెండింగ్‌లో ఉన్నాయని,,ఈ ప్రోత్సాహకాలు అందక దాదాపు 224 మంది రాష్ట్రంలోని క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు.. గురువారం అయన మీడియాతో మాట్లాడుతూ శాప్ విజ్ఞప్తితో క్రీడా ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందన్నారు..189 మంది క్రీడాకారులకు రూ.7,96,62,289 నగదును కూటమి ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసిందని చెప్పారు.. క్రీడాకారులకు ప్రోత్సహకాలు విడుదల చేయడంపై సీఎం చంద్రబాబుతోపాటు మంత్రి నారా లోకేష్‌కు శాప్ చైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు..క్రీడా ప్రోత్సహకాలు విడుదల చేయడంపై క్రీడాకారులతోపాటు క్రీడా సంఘాలు సైతం హర్షం వ్యక్తం చేశాయి.