రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్బీఐ గవర్నర్
అమరావతి: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ వడ్డీ రేట్లను తగ్గిస్తూ శుక్రవారం నిర్ణయం ప్రకటించింది..ఈ నిర్ణయం దేశంలోని కోట్లాది మంది మధ్య తరగతి గృహ రుణ కొనుగోలుదారులకు పెద్ద ఉపశమనం కలిగించింది..RBI MPC రెపో రేటును 0.25 శాతం తగ్గించింది..రెపో రేట్లు 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు..దాదాపు 56 నెలల తరువాత RBI రెపో రేటును తగ్గించింది..ఫిబ్రవరి 2023 నుంచి వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు లేదు..ఈ నిర్ణయం RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా తొలి ద్రవ్య విధాన సమావేశం.