ట్రంప్ నిర్ణయానికి బ్రేకులు వేసిన డిస్ట్రిక్ట్ జడ్జి విలియం అల్సప్
అమరావతి: అమెరికా అధ్యక్షడిగా రెంవడ సారి బాధ్యతలు చేపట్టి ట్రంప్, పాలనలో దూకుడు ప్రదర్శిస్తు దూసుకుని పోతున్న సమయంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది..ట్రంప్, డోజ్ పేరుతో ఏర్పాటు చేసిన విభాగం సిఫారస్సుల మేరకు భారీ సంఖ్యలో ఫెడరల్ ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు..ట్రంప్ నిర్ణయానికి డిస్ట్రిక్ట్ జడ్జి విలియం అల్సప్ ఫెడరల్ ఉద్యోగులను తొలగిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేశారు.. అమెరికా ప్రభుత్వ వ్యయాల తగ్గింపు ప్రణాళికల్లో భాగంగా పలు విభాగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగులను ట్రంప్ ప్రభుత్వం తొలగిస్తున్నారు..ఈ నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.. ఈ క్రమంలో అమెరికాలో ఫెడరల్ ఏజెన్సీల్లో ఉద్యోగులను తొలగించాలన్న ప్రభుత్వ ఆదేశాలపై పలు యూనియన్లు,, న్యాయవాద సంఘాలు కోర్టులో పిటీషన్ వేశాయి..దీనిపై యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో విచారణ జరిగింది.. ఈ సందర్బంగా డిస్ట్రిక్ట్ జడ్జి విలియం అల్సప్ తీర్పును వెలువరిస్తూ,, అధ్యక్షుడి నిర్ణయాన్ని నిలిపివేస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు.. పర్సనల్ మేనేజ్‌మెంట్ కార్యాలయానికి అలాంటి అధికారాలు లేవని న్యాయమూర్తి స్పష్టం చేశారు..తొలగింపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆదేశించారు.