AP&TGPOLITICS

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై సస్పెన్షన్ వేటు వేసిన కాంగ్రెస్

హైదరాబాద్: ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణనను నివేదిక పత్రులను కాల్చడంతో పాటు పలు వర్గాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం సస్పెన్షన్ వేటు వేసింది.. అయన చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాల్సిందిగా గత నెల 6వ తేదిన కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం, తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.. పార్టీ నియమాలు పాటించాల్సిన అవసరం ఉందని షోకాజ్ నోటీసుల్లో గుర్తు చేసింది..ప్రభుత్వ తీసుకునే విధాన పరమైన నిర్ణయాలను బహిరంగగా మాట్లాడడం,,పలు వర్గాలపై అసభ్యకరమైన విధంగా వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలను పార్టీ తప్పుగా పట్టింది.. పార్టీ షోకాజ్ నోటీసులకు తీన్మార్ మల్లన్న ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో,, కాంగ్రెస్ పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది..ఈ మేరకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *