రంగనాథస్వామి ఆలయంలో వివాహం చేసుకున్న సినినటులు సిద్ధార్ద్,అదితిరావ్ హైదరిలు
హైదరాబాద్: కోలీవుడ్ నటుడు సిద్ధార్ద్,,తెలుగు నటి అదితిరావ్ హైదరిలకు తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని 400 ఏళ్ల పురాతన రంగనాథస్వామి ఆలయంలో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది.. ఇరు కుటుంబాలతో పాటు వీరికి అత్యంత సన్నిహితుల ఈ వివాహంకు హాజరయినట్లు సమాచారం..వనపర్తి సంస్థానాధీశుల వారసుల్లో నటి అదితిరావు హైదరి కూడా ఒకరు..దీంతో పురోహితులు దగ్గరుండి ఈ పెళ్లి జరిపించినట్లు తెలుస్తొంది..వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు..పెళ్లి అయిన విషయాన్ని తెలుసుకున్న సినీ ప్రముఖులతో పాటు అభిమానులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.