NATIONAL

మూడు రాష్ట్రాల్లో హిమపాతం,రహదారులు మూసివేత,మంచులోకి చిక్కుకున్న 47 మంది కార్మికులు

అమరావతి: దేశంలోని మూడు రాష్ట్రాల్లో హిమపాతం కురుస్తోంది.. జమ్ముకశ్మీర్,, హిమాచల్‌ప్రదేశ్,, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి.. ఎటు చూసినా మంచు గుట్టలే దర్శనమిస్తున్నాయి..అ ప్రాంతంలోని రోడ్లన్నీ శ్వేతవర్ణాన్ని తలపిస్తున్నాయి.. రోడ్లపై భారీగా హిమపాతం పేరుకుపోవడంతో అధికారులు పలు రహదారుల్ని మూసివేశారు..జమ్ముకశ్మీర్‌లో ఎడతెరిపిలేకుండా మంచు కురుస్తుండడంతో చాలా ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి.. అప్రమత్తమైన అధికారులు జమ్ము-శ్రీనగర్‌ జాతీయ రహదారిని మూసివేశారు.. దీంతో ఉదంపూర్‌ వద్ద రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి..బార్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ అధికారులు రోడ్డుపై పేరుకుపోయిన మంచును తొలగిస్తున్నారు..హిమాచల్‌ప్రదేశ్‌లోని లెహ్‌,, స్పితి సహా పలు ప్రాంతాల్లో నిరంతరంగా మంచు వర్షం కురుస్తోంది..పర్యవసనం ఇళ్లు,,వాహనాలు,,రోడ్లు,, చెట్లపై దట్టంగా మంచు పేరుకుపోయింది..

ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో హిమపాతం బీభత్సం సృష్టించింది..సైనికుల కోసం వేస్తున్న రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా అక్కడి మంచును కార్మికులు తొలగిస్తున్న సమయంలో హిమపాతం వారిని ముంచేసింది..బద్రీనాథ్‌కు దగ్గరలోని చమోలి జిల్లాలోని మనా గ్రామంలోని బీఆర్వో శిబిరానికి సమీపంలో ఈ విషాదకర సంఘటన జరిగింది..ఆ సమయంలో 57 మంది కార్మికులు మంచు చరియల కిందనే చిక్కుకుపోగా,, వారిలో 10 మందిని సహాయక బృందాలు రక్షించాయి..మిగిలిన వారిని రక్షించడానికి రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు..ఆ ప్రాంతంలో ఇప్పటికీ మంచు దట్టంగా కురుస్తుండడంతో రెస్క్యూ సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..ఈ ప్రాంతంలో కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి నెలకొన్నది..పోలీసులతో పాటు బీఆర్వో సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.. ”మానా గ్రామం సమీపంలో బీఆర్వో చేపడుతున్న నిర్మాణ పనుల సమయంలో చాలా మంది కార్మికులు హిమపాతం కింద చిక్కుకున్నట్లు తెలిసింది..ఐటీబీపీ, బీఆర్వో, ఇతర రెస్క్యూ టీమ్‌లు రెస్క్యూ ఆపరేషన్‌లను నిర్వహిస్తున్నాయి.. కార్మిక సోదరుల భద్రత కోసం దేవుడిని ప్రార్థిస్తున్నాను” అంటూ ఉత్తరఖండ్ ముఖ్యమంత్రి పుష్కర సింగ్ థామి ట్వీట్ చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *