సోలార్ విద్యుత్తు ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించండి-కమిషనర్ సూర్యతేజ
నెల్లూరు: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సూర్య ఘర్ బిజిలి పథకంపై ప్రజలకు అవగాహన కల్పించి అతి తక్కువ ఖర్చుతో సోలార్ విద్యుత్ ను ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ వార్డు సచివాలయ ఎనర్జీ సెక్రటరీలకు కమిషనర్ సూర్యతేజ సూచించారు. పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా కమిషనర్ శుక్రవారం 23వ డివిజన్ పడారుపల్లి,చలపతి నగర్, సుందరయ్య కాలనీలో పర్యటించారు.ఈ సందర్భంగా వివిధ అంశాలపై కమిషనర్ స్పందిస్తూ రోడ్డుపై ట్రాఫిక్ కు ఇబ్బందికరంగా రోడ్డుపై నిలిపి ఉన్న పాత ఉపయోగంలో లేని వాహనములను వెంటనే పోలీసు వారి సహకారంతో తొలగించవలసినదిగా టౌన్ ప్లానింగ్ సిబ్బందిని ఆదేశించారు. రోడ్డుపై ఎత్తుగా ఉన్న పలకలను తొలగించి సమాంతరంగా చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కమీషనర్ ఆదేశించారు. జెసిబిల సహాయంతో ప్రజలకు అసౌకర్యంగా ఉన్నటువంటి ఖాళీ స్థలలో ఉన్న పిచ్చి మొక్కలను యజమానులకు నోటీసులు ఇచ్చి వారి స్వంత ఖర్చులతో పరిశుభ్రంగా ఉంచుకునేలా చర్యలు తీసుకోవాలని శానిటేషన్ సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు. జంక్షన్ పాయింట్ల వద్ద చిన్న లైట్లను తొలగించి అదే స్థానంలో పెద్ద హై మాక్స్ లైట్లు అమర్చాలని కమిషనర్ ఇంజనీర్ లైటింగ్ విభాగం వారికి సూచించారు.