CRIMENATIONALOTHERSWORLD

బంగ్లాదేశ్‌లో మరో హిందువును కత్తుల పొడిచి,అపైన కిరోసిన్ పోసి దాడి..

బంగ్లాదేశ్‌లో హిందువులను దారుణంగా కత్తుల పొడిచి,,అపైన పెట్రోల్ పోసి తగులపెడుతున్నారు. మన దేశంలో వున్న సూడో సెక్కూలరిస్టుల నోళ్లకు ఏమైంది? ఒక్కరు కూడా ఈ దారుణలపై తీవ్రంగా స్పందించడం లేదు ఎందుకని?

అమరావతి: నెల రోజుల వ్యవధిలో బంగ్లాదేశ్‌లో నాలుగురు హిందువులను దారుణంగా చంపివేశారు.డిసెంబర్ 31వ తేదీన ఖోకన్ దాస్(50) అనే హిందూవును,,మతోన్మాదుల కత్తులతో పొడవడంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యాడు. ఆస్పత్రి బెడ్‌పై ప్రాణాలతో పోరాడుతూ ఉన్నాడు. షరియాత్పూర్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి ఖోకన్ దాస్ ఇంటికి వెళుతూన్న సమయంలో మతోన్మాదుల గుంపు అతడిపై కత్తులతో దాడి చేసి,, విచక్షణా రహితంగా పొడిచేసింది. తరువాత అతడిపై మతోన్మాదుల గుంపు కిరోసిన్ పోసి నిప్పంటించారు. అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు అతడ్ని గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

డిసెంబర్ 16వ తేదీన దీపు చంద్రదాస్ అనే యువకుడు మతోన్మాదుల దాడికి గురయ్యాడు. అతడితో పాటు పని చేస్తున్న వారే దారుణానికి ఒడిగట్టారు. కొట్టి చంపేసి, చెట్టుకు వేలాడదీసి కాల్చేశారు.

ఈ సంఘటన జరిగిన వారం రోజులకే డిసెంబర్ 24 రాజ్‌భరీలోని హోసయ్‌దంగ గ్రామానికి చెందిన 29 ఏళ్ల అమ్రిత్ మండల్ అలియాస్ సామ్రాట్ అనే యువకుడిని మతోన్మాదులు దారుణంగా కొట్టి చంపేశారు.

డిసెంబరు 29వ తేదీన సైల్‌హెట్ సదర్ కాదిర్‌పురకు చెందిన భజేంద్ర బిశ్వాస్ అనే 40 ఏళ్ల వ్యక్తి తనతో పాటు పని చేసే వ్యక్తి షాట్ గన్ తో కాల్చి చంపేశాడు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *