టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు.మోహన్ బాబుపై కేసు నమోదు
హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు.మోహన్ బాబుపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది..తనతో పాటు తన భార్య మోనికాపై మోహన్ బాబు దాడిచేశాడని ఆయన రెండవ కుమారుడు మంచు మనోజ్,, గాయాలతోనే పోలీస స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదును అందించాడు..దింతో మోహన్ బాబుపై పహడి షర్రిఫ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది..ఇదే సమయంలో తన కుమారుడు మనోజే తనపై దాడి చేశాడని మోహన్ బాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు..ఆస్తులు,,స్కూల్ వ్యవహారాలకు సంబంధించి ఈ గొడవలు జరిగినట్లు సమాచారం..కొంతకాలంగా మంచు ఫ్యామిలీలో తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి..
అసత్యాలను ప్రచారం చేయవద్దు:- ఈ వార్తలను మోహన్ బాబు ఖండిస్తూ, ఈ వార్తల్లో నిజం లేదని అన్నారు.. ‘మోహన్ బాబు , మంచుమనోజ్ పరస్పర ఫిర్యాదులు చెసుకున్నారనే వార్తల్లో నిజం లేదు. మంచు మనోజ్ దెబ్బలతో వచ్చి మరీ పొలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నట్లు ఊహాజనితమైన కధనాలను కొన్ని మీడియా చానెల్స్ ప్రసారం చేస్తున్నాయి.. ఎవిడెన్స్ లు లేకుండా అసత్య ప్రచారాలను చేయకండి’ అంటూ మీడియాను హెచ్చించారు.