బుధ, గురువారాల్లో రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం
అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతం & ఆనుకుని ఉన్న తూర్పుహిందూ మహాసముద్రంపై అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణశాఖ తెలిపింది.. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది..సోమవారం రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని పేర్కొంది.