జార్జ్ సోరోస్ ఫౌండేషన్‌తో సోనియాగాంధీకి సంబంధాలు వున్నాయి-బీజీపీ
భాతరదేశంను విచ్చినం చేయడానికి ప్రయత్నాలు..
అమరావతి: సోనియాగాంధీ చైర్మన్‌గా ఉన్న రాజీవ్ గాంధీ ఫౌండేషన్, జార్జ్ సోరోస్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేసిందని,,అమెరికాకు చెందిన జార్జ్ సోరోస్ పౌండేషన్ నుంచి ఆర్థిక సాయం పొందే FDL-AP ఫౌండేషన్‌తో సోనియాగాంధీకి సంబంధాలున్నాయని బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది..జమ్మూకశ్మీర్‌ను స్వతంత్ర దేశం చేయాలనే భావజాలంతో ఎఫ్‌డీఎల్-ఏపీ పౌండేషన్ పనిచేస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది..దీనిని బట్టి భారతదేశ అంతర్గత వ్యవహారాలు,, రాజకీయ సంబంధాలపై విదేశీ సంస్థల ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చని బీజీపీ వెల్లడించింది.. రాహుల్ గాంధీ “భారత్ జోడో యాత్ర’లో ఆయనతో కలిసి సోరోస్-ఫండెడ్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు సలీల్ షెట్టి పాల్గొన్నారు” అని బీజేపీ తెలిపింది..అదానీపై రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ ను జార్జి సోరోస్ నుంచి నిధులు పొందే ఆర్గనైజ్డ్ క్రైమ్అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (OCCRP) సంస్థ లైవ్ టెలికాస్ట్ చేసిందని,, దీనిని బట్టే జార్జ్ సోరోస్‌తో కాంగ్రెస్‌కు ఉన్న బలమైన సంబంధం గురించి ఆర్దం చేసుకోవచ్చంది.. భారత ఆర్థిక ఛిన్నభిన్నం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తొందని మండిపడింది..భారతదేశ ఆర్దిక వ్యవస్థను పట్టాలు తప్పించే ప్రమాదకరమైన యోచన అర్ధమవుతుందని బీజేపీ ఆరోపించింది..కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సైతం జార్జ్ సోరోస్ తమ పాతమిత్రుడని బహిరంగంగానే ఒప్పుకున్నారని గుర్తు చేసింది..పార్లమెంట్ సమావేశాలకు ముందు విదేశీ సంస్థలు తప్పుడు కథనాలు ప్రచరిస్తే,,వాటిని పట్టుకుని రాహుల్ గాంధీ పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరగకుండా అడ్డుకుంటారని మండిపడింది..కాంగ్రెస్ పార్టీ భారతదేశం అభివృద్ది చెందకుండా అడ్డుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తొందని,,ఇందుకు ఎన్నో ఉదహారణలు వున్నయని పేర్కొంది.