AP&TG

పులివెందుల సమీపంలో లోయ పడిన ఆర్టీసీ బస్సు

అమరావతి: కడప జిల్లా పులివెందుల సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి..ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీలను తప్పించబోయి ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు 30 అడుగుల లోయలో పడింద..కదిరి నుంచి పులివెందులకు వస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది..స్థానికులు అందించిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలను చేపట్టారు..ప్రమాదంలో గాయాపడిన ప్రయాణికులను పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *