ప్రారంభం అయిన పోలవరం కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం పనులు
అమరావతి: పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసే విషయంలో కూటమి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది..2020 వరదల్లో కొట్టుకుపోయిన డయాఫ్రం వాల్ స్థానంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి శనివారం డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను కాంట్రాక్టు సంస్థ ప్రారంభించింది.. ఇందుకు సంబంధించిన భూమిపూజ, హోమాన్ని నిర్వహించారు..2020లో దెబ్బతిన్న డయాఫ్రం వాల్ స్థానంలో 383 ప్యానెల్స్ తో లక్ష క్యూబిక్ మీటర్లకు పైగా ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరగనుంది..ఈ డయాఫ్రం వాల్ నిర్మాణం కోసం జర్మనీ నుంచి ట్రెంచ్ కట్టర్లు, భారీ గ్రేబర్లు, డిశాండింగ్ యంత్రాలు కూడా వచ్చాయి..
కొత్త డయాఫ్రం వాల్ రూ.990 కోట్లు ఖర్చుతో 1396 మీటర్ల పొడవు,, ఒకటిన్నర మీటర్ల మందంతో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరగనున్నది..కనిష్టంగా 20 మీటర్లు,, గరిష్టంగా 90 మీటర్ల లోతు నుంచి వాల్ నిర్మాణం చేపడతారు..పాత డయాఫ్రమ్ వాల్‌కు 6 మీటర్ల ఎగువన కొత్త నిర్మాణం పనులు ప్రారంభం అయ్యాయి..డయాఫ్రం వాల్ సగం నిర్మాణం పూర్తి కాగానే సమాంతరంగా దాని పైన ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం నిర్మాణం ప్రారంభం అవుతుంది..