ఆంధ్రప్రదేశ్ ను అదుకునేందుకు NDRF కాదు NDA కూటమి కూడా వుంది-అమిత్ షా
అమరావతి: ప్రకృతి వైఫరీత్యాలు సంభవించినప్పుడు బాధితులను అదుకునేందుకు NDRF బృందాలు రంగ ప్రవేశం చేస్తాయని అలాగే 2019 నుంచి 2024 వరకు గత ప్రభుత్వం చేసిన మానవ తప్పిదాలతో రాష్ట్రంలో ఏర్పాడిన పరిస్థితులను చక్కదిద్దేందుకు NDA ప్రభుత్వం రంగంలోకి దిగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు..అదివారం కృష్ణా జిల్లా కొండపావులూరులో NDRF ఆవిర్భావ వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌తో పాటు రాష్ట్ర మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.. నూతన NIDM భవనంతో పాటు 10వ బెటాలియన్ NDRF ప్రాంగణాన్ని ఇతర నేతలతో కలిసి అమిత్ షా ప్రారంభించారు..అలాగే తిరుపతి రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ను వర్చువల్‌గా అమిత్‌షా ప్రారంభించారు..విపత్తులు సంభవించినప్పుడు ఎలా ఎదుర్కొంటారనే అంశాల్ని NDRF సిబ్బంది ప్రదర్శించారు.
గత ప్రభుత్వం హయాంలో జరిగిన విధ్వంసం గురించి చింతించ వద్దని,,ప్రధాని మోదీ, చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో మూడింతల ప్రగతి సాధిస్తారని భరోసా ఇచ్చారు..6 నెలల వ్యవధిలో ఏపీకి రూ.3 లక్షల కోట్ల విలువైన సహకారం అందించామన్నారు..
ఆంధ్రుల ఆత్మగౌరవంతో ముడిపడిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి రూ.11,440 కోట్లు ఆర్దిక సాయం ప్రకటించామన్నారు..విశాఖలో రూ.2 లక్షల కోట్ల విలువైన గ్రీన్ హైడ్రోజన్ పెట్టుబడులు,,విశాఖ రైల్వేజోన్‌ను కూడా పట్టాలెక్కించడం జరిగిందని అమిత్‌షా వెల్లడించారు..గత ప్రభుత్వం రాజధాని అమరావతిని బుట్టదాఖలు చేసిందని అయితే అమరావతి రాజధానిని అభివృద్ది చేసేందుకు హడ్కో ద్వారా అమరావతికి రూ.27 వేల కోట్ల సాయం అందించడం జరిగిందన్నారు.. ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి అయిన పోలవరంపై చంద్రబాబుతో చర్చించడం జరిగిందని,,2028లోపు ఆంధ్రప్రదేశ్ మెుత్తం పోలవరం ద్వారా నీళ్లు పారిస్తామని హామీ ఇచ్చారు.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చంద్రబాబుకు, మోదీ అండదండలు ఉన్నాయని తెలిపారు.