ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ బీజేపీ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్య
అమరావతి: రాజ్యసభ స్థానాలకు బీజేపీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది..ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్య,, ఒడిశా నుంచి సుజీత్ కుమార్,, హర్యానా నుంచి రేఖా శర్మ పోటీ చేస్తున్నారు..షెడ్యూల్ ప్రకారం రాజ్యసభకు ఉప ఎన్నికలు డిసెంబర్ 20వ తేదిన నిర్వహించి, అదేరోజు ఫలితాలను ప్రకటిస్తారు.. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, హర్యానా నుంచి ఆరుగురు సభ్యులను రాజ్యసభకు ఎంపిక చేయాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి 3 సీట్లు, ఒడిశా, పశ్చిమబెంగాల్, హర్యానా నుంచి ఒక్కో సీటు ఖాళీగా ఉన్నాయి..
ఆంధ్రప్రదేశ్ నుంచి 3 ఎంపీలను రాజ్యసభకు పంపాల్సి ఉంది..వైసీపీకి చెందిన ఎంపీలు మోపిదేవి.వెంకటరమణ రావు,,బీద మస్తాన్ రావు యాదవ్,,రాగ్య కృష్ణయ్య రాజ్యసభకు రాజీనామా చేయడంతో ఆ మూడు స్థానాలకు ఎన్నిక తప్పని సరి అయింది..టీడీపీ నుంచి మరో ఇద్దరు రాజ్యసభకు వెళ్లనున్నారు.. వారి పేర్లను టీడీపీ అధిష్టానం ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు.. సోమవారం సాయంత్రానికి టీడీపీ ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.