మద్యంపై ప్రివిలేజ్ ఫీజుతో కలిపి లిక్కర్ ధరలు!
అమరావతి: రాష్ట్రంలో 16వ తేదీ నుంచి నూతన మద్యం విధానం అమలులోకి రానున్న నేపధ్యంలో దేశంలో తయారయ్యే విదేశీ మద్యం(IMFL) బాటిల్ MRP ధరపై అదనపు ప్రివిలేజ్ ఫీజు విధిస్తూ ప్రభుత్వం సవరణ చేసింది.. అదనపు ప్రివిలేజ్ ఫీజు కింద MRP ధరలో చిల్లర కాకుండా తదుపరి పది రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం సర్దుబాటు చేసింది..పెంచిన ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి..