ఐఎఎస్ అధికారులు తమకు కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలని ఆదేశించిన టి.జి.హైకోర్టు
అమరావతి: ఆంధ్రప్రదేశ్,,తెలంగాణ విభజన సమయంలో ఆంధ్రాకు కేటాయించిన 7మంది IAS అధికారులకు తెలంగాణ హైకోర్టు మొట్టికాయలు వేసింది..తమ బదిలీలపై క్యాట్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ IAS అధికారులు వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు డిస్మిస్ చేసింది.. వెంటనే ఏడుగురు అధికారులు తమకు కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలని ఆదేశించింది..క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ IAS అధికారులు వాకాటి కరుణ, ఆమ్రపాలి కాట, వాణీప్రసాద్, రొనాల్డ్ రోస్ (తెలంగాణ), సి.హరికిరణ్, లోతేటి శివశంకర్, జి.సృజన (ఆంధ్రప్రదేశ్) తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.. దీనిపై బుధవారం విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు,, క్యాట్ ఆదేశాలను సమర్థించింది.. IAS అధికారులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది.. అక్టోబర్ 16 (బుధవారం) సాయంత్రంలోపు అధికారులు వారి సొంత రాష్ట్రాల్లో రిపోర్టు చేయాల్సి ఉంది.