DISTRICTSPOLITICS

1925లోనే జగన్ కుటుంబం క్రైస్తవులుగా మారిపోయారు-ఆనం

నెల్లూరు: వైసీపీ అధినేత,,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు..జగన్ తిరుమల పర్యటనలో డిక్లరేషన్‌ ఇస్తారా ? లేదా ? అన్న విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చజరుగుతొంది..శుక్రవారం నగరంలోని టీడీపీ కార్యలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రమణరెడ్డి మాట్లాడుతూ, వైఎస్ జగన్… హాఫ్ టిక్కెట్… హిందువా? క్రిష్టియనా? అంటూ ప్రశ్నించారు.. జగన్ ముత్తాత వెంకటరెడ్డి ముఠా నాయకుడని,, వందేళ్ల కిందట 1925లో క్రిష్టియన్‌గా మారారని,, అప్పటి నుంచి వారి కుటుంబమంతా ఏసుప్రభువునే నమ్ముకున్నారని తెలిపారు.. వైఎస్ తల్లి జయమ్మ, భార్య విజయమ్మ, జగన్ భార్య భారతి, చెల్లెలు షర్మిలా క్రిష్టియనే అని చెప్పారు.. “సాక్షాత్తు విమలమ్మ” మా తాత 1925లో క్రైస్తవుడిగా మారాడని,,రాయలసీమలో ముఠా నాయకుడని విమలమ్మ చెప్పిందన్నారు.. జగన్ నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావ్? మీ అమ్మమ్మ పేరు మీద పులివెందులలో చర్చి కట్టారా? లేదా? జగన్… నీకు, భారతితో క్రిష్టియన్ పెళ్లి జరిగింది.. నీ తండ్రి.. మా పెద్దాయన… వైఎస్ చనిపోయినప్పుడు క్రిష్టియన్ పద్ధతిలో అంత్యక్రియలు జరిగాయా? లేదా? జగన్.. సీబీఐకి ఇచ్చిన అఫెడవిట్‌లో క్రిష్టియన్‌గా చెప్పాడు.. యేసు ప్రభువా?… తండ్రీ… నీ బిడ్డ క్రిష్టియన్ కాదంటున్నాడు.. భస్మం చేయి… ప్రభువా…తన ఎదురు ఏ దేవుడూ లేడని, తన తరువాత ఎవరూ ఉండరని చెప్పాడు.. రెండు మతాల్లో ఉండొద్దన్నాడు.. జగన్…..తిరుమలకి రా… నీ భార్య, కుమార్తెలని తీసుకుని రా… తలనీలాలు ఇవ్వు.. నువ్వు హిందువు, నీ భార్య భారతి, తల్లి క్రిష్టియన్లా ?… జగన్ శవయాత్ర చేసేటప్పుడే మొట్టమొదట తిరుమలకి వచ్చాడు.. పెళ్లయ్యాక వచ్చావా? పిల్లలకి అన్నప్రాసన చేశావా? అంటూ ప్రశ్నలు సంధించారు.. క్రిష్టియన్ సోదరులారా ఒక్కసారి కళ్లు తెరిచి ఆలోచించండి.. జగన్ కుటుంబమంతా దొంగలు.. ఆ దొంగలని నమ్మొద్దు..యేసు ప్రభువు… వెంకటేశ్వరస్వామితో పెట్టుకున్నావ్… భస్మమైపోతావ్… నువ్వేమైనా తోపా… సోనియా గాంధీ, ఫరుఖ్ అబ్దుల్లా, అబ్దుల్ కలాం, మహ్మద్ జానీలు డిక్లరేషన్ పై సంతకాలు పెట్టి ఆలయంలోకి వెళ్లారు.. మీరేమైనా దేవుళ్లకి దేవుళ్లా? కోన్ కిస్క గొట్టంగాళ్లు… ఎవరికంటే నువ్వు గొప్పా… ఒరేయ్ సుబ్బిగా… నువ్వు గురుస్వామివా? టీటీడీ ఛైర్మన్‌గా ఉండి పింక్ డైమండ్ కేసు విత్ డ్రా చేసుకుంటావా?… ఒరేయ్ పంది వెధవ.. పొన్నవోలు… కేజ్, కేజ్ ఏందిరా… ఇంగ్లీషు రాకపోతే కిలోలని అనరా? నీకెట్టా ఇచ్చాడ్రా… ఆ పోస్టు. కనపర్తి‌పాడులో పందులు మేపేవాడు కాబట్టి, పంది మాంసం ధరలు చెబుతున్నాడు అంటూ జగన్, వైవీ సుబ్బారెడ్డి, పొన్నవోలు సుధాకర్‌పై ఆనం వెంకటరమణరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *