ప్రోబా-3 ఉపగ్రహంలో సమస్యతో ప్రయోగాన్ని వాయిదా వేసిన ఇస్రో
అమరావతి: ఇస్రో బుధవారం PSLV C-59 రాకెట్ ప్రయోగం వాయిదా పడింది.. ప్రోబా-3 ఉపగ్రహంలో సాంకేతిక లోపం గుర్తించడంతో PSLV C-59 రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు ఇస్రో వెల్లడించింది..రాకెట్ ప్రయోగానికి ముందు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రోబా-3 ఉపగ్రహంలో సమస్యను గుర్తించడంతో,,ఈ విషయంను ఇస్రోకు తెలిపింది..దింతో చివరి నిమిషంలో రాకెట్ ప్రయోగాన్ని నిలిపి వేశారు..గురువారంసాయంత్రం తిరిగి 4:12లకు PSLV C-59 రాకెట్ ప్రయోగం జరగనుంది.. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం-(SHAR) నుంచిబుధవారం సాయంత్రం 4 గంటల 08 నిమిషాలకు PSLV C-59 రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు ఇస్రో వెల్లడించింది..యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాన్ని ఈ రాకెట్ కక్ష్యలోకి చేర్చాల్సి వుంది.