జనవరి ఒకటి నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం- మంత్రి నారాయణ
విజయవాడ,విశాఖపట్నంలో మెట్రో..
అమరావతి: ల్యాండ్ పూలింగ్ ద్వారా రాజధానికి భూములిస్తున్న రైతులకు ప్రాధాన్యత ప్రకారం వారి గ్రామాల్లోనే తిరిగి ప్లాట్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ..ఇంకా 3వేల 550 ఎకరాలు భూసమీకరణ ద్వారా రైతుల నుంచి సేకరించాల్సి ఉందన్నారు.గతంలో భూములు ఇవ్వని వారు తాజాగా సీఆర్డీఏ కు భూములు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారని చెప్పారు.గత నెల రోజులుగా 120 ఎకరాలు భూమిని రైతులు ల్యాండ్ పూలింగ్ ద్వారా సీఆర్డీఏకు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు..సచివాలయంలో సీ.ఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 37వ సీఆర్డీఏ అధారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు..
రాయపూడి సమీపంలో సీడ్ యాక్సిస్ రోడ్డును ఆనుకుని సీఆర్డీఏ కార్యాలయాన్ని ప్రభుత్వం నిర్మిస్తుంది…ఈ భవనం నిర్మాణానికి 160 కోట్లు కేటాయిస్తూ అధారిటీ నిర్నయం తీసుకున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు.మొత్తం 3.62 ఎకరాల్లో జీ ప్లస్ 7 విధానంలో భవనం నిర్మిస్తున్నారు..ఈ భవనం నిర్మాణం పూర్తయితే సీఆర్డీఏ,ఏడీసీతో పాటు మొత్తం మున్సిపల్ శాఖకు చెందిన అన్ని విభాగాలు ఇక్కడి నుంచే పనిచేస్తాయన్నారు…దీనివల్ల పాలన సులభం అవుతుందని చెప్పారు మంత్రి..ఈ భవనం నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని అన్నారు.సీడ్ క్యాపిటల్ లో మొత్తం 14.46 ఎకరాల్లో జీ ప్లస్ 18 అంతస్తులు ఉండేలా మొత్తం 12 టవర్లను నిర్మించాలని గత టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది…
విజయవాడ,విశాఖపట్నంలో మెట్రో:-విజయవాడ,విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్ లపై చర్చ జరిగింది.రాష్ట్ర పునర్వవస్థీకరణ చట్టం ప్రకారం విజయవాడ,విశాఖలో మెట్రో ప్రాజెక్ట్ లు చట్టంలో పేర్కొన్నారన్నారు… విజయవాడలో మొదటి దశ38.40 కిమీ,,రెండవ దశలో 27.80 కిమీలు.. మొత్తం రెండు దశలకు కలిపి 66.20 కిమీ మేర నిర్మించే ప్రాజెక్ట్ కు 25 వేల 130 కోట్లు ఖర్చవుతుందని మంత్రి నారాయణ చెప్పారు..విశాఖపట్నంలో మొదటి దశలో 46.23 కిమీలు,, 30.67 కిమీ మేర మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు.. విశాఖలో మొత్తం 76.90 కిమీ మేర మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణానికి మొత్తం 17,232 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు మంత్రి నారాయణ చెప్పారు.
అమరావతి నిర్మాణ పనులు:- అమరావతి నిర్మాణానికి సంబంధించి ప్రస్తుతం అధ్యయనం జరుగుతుందన్నారు. త్వరలో అన్ని పనులకు టెండర్లు పిలిచి జనవరి ఒకటో తేదీ నుంచి పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు ప్రారంభించేలా ముందుకెళ్లున్నట్లు స్పష్టం చేసారు.