కంగనారనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న”ఎమర్జెన్సీ” చిత్రంను తెలంగాణలో బ్యాన్ చేస్తారా?
అమరావతి: బాలీవుడ్ నటి,,ఎం.పీ కంగనారనౌత్ ప్రధాన పాత్రలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాలనలో 1975 జూన్ 25 నుండి 1977 వరకు కొనసాగిన ఇండియన్ ఎమర్జెన్సీ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు..పొలిటికల్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రంలో కంగనారనౌత్ ఇందిరాగాంధీ పాత్రలో నటిస్తోంది..ఇప్పటికే ఈ చిత్రం విడుదల కావల్సి వుండగా ఎన్నికలకు ముందు వివాదాలకు అవకాశం ఇవ్వకుండా,,ఫిల్మ్ మేకర్స్ సెప్టెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు..విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలంగాణలో నిషేధం విధించే అవకాశాలున్నాయన్న వార్తలు వస్తున్నాయి..సినిమా నిషేధం అంశాన్ని పరీలిస్తుందని ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ తెలిపారు..మాజీ ఐపీఎస్ అధికారి తేజ్ దీప్ కౌర్ మీనన్ నేతృత్వంలోని తెలంగాణ సిక్కు సొసైటీ ప్రతినిధుల బృందం షబ్బీర్‌ను కలిసి ఎమర్జెన్సీ విడుదలపై నిషేధం విధించాలని కోరింది.. సిక్కు సొసైటీ ప్రతినిధులు సినిమాలో సిక్కు సమాజాన్ని చూపించిన తీరు పట్ల ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో.. రాష్ట్రంలో సినిమాను నిషేధించే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డిని షబ్బీర్ కోరినట్టు సమాచారం..ఎమర్జెన్సీ సమయంలో పౌరహక్కుల సస్పెన్షన్,, ఇందిరా గాంధీ వ్యతిరేకుల అరెస్టుతోపాటు పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి..ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ రాజకీయ వేత్త జయప్రకాశ్ నారాయణ్ పాత్రలో పాపులర్ బాలీవుడ్ దర్శకనిర్మాత అనుపమ్ ఖేర్ నటిస్తుండగా,, శ్రేయాస్ తల్పడే,, భూమికా చావ్లా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.